మా ఓటే మా గౌరవం..హుస్నాబాద్ మండలంలో యువత ఫ్లెక్సీతో వినూత్న ప్రచారం

మా ఓటే మా గౌరవం..హుస్నాబాద్ మండలంలో  యువత ఫ్లెక్సీతో వినూత్న ప్రచారం

హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు:  ప్రలో భాలకు లొంగం.. మా ఓటే మా గౌరవం అంటూ హుస్నాబాద్ మండలం గాంధీనగర్ లో యువత ఫ్లెక్సీతో వినూత్న ప్రచారం చేపట్టారు. గ్రామంలో పలువురు యువకులు తమ ఇళ్ల ముందు ప్రత్యేక ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి “ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు, మా ఓటు అమ్మబడదు” మా ఓటు విలువైనది -అమ్ముకోము” వంటి సందేశాలను పొందుపరిచారు. 

ఈ ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యువత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరైనా డబ్బు పంచుతున్నట్లు తెలిస్తే వారిని అడ్డుకుంటామన్నారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్న విద్యావేత్తలు, రాజకీయ అనుభవం ఉన్నవారు లేదా యువతకు సర్పంచ్ బాధ్యతలు అప్పగించే అవకాశం రావాలని వారు అభిప్రాయపడ్డారు.