రామకృష్ణాపూర్ లోని సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో..స్టూడెంట్లను చితకబాదిన ఘటనపై ఎంక్వయిరీ

రామకృష్ణాపూర్ లోని సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో..స్టూడెంట్లను చితకబాదిన ఘటనపై ఎంక్వయిరీ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ లోని సంక్షేమ గురుకుల బాలికల స్కూల్ లో  దొంగతనం నేరం మోపుతూ 8వ తరగతికి చెందిన నలుగురు విద్యార్థులను చితకబాదిన ఘటనపై సోమవారం సంబంధిత ఆఫీసర్లు ఎంక్వయిరీ చేపట్టారు. కలెక్టర్ ​కుమార్ ​దీపక్ ​ఆదేశాలతో జిల్లా ఇన్​చార్జ్ ఆఫీసర్​ కె.మహేశ్వర్​రావు, జిల్లా కోఆర్డినేటర్​ రామకల్యాణి, ఇన్​చార్జ్ జోనల్​ ఆఫీసర్​ గిరిజ, పట్టణ ఇన్​చార్జ్ ఎస్సై 

శ్రీనివాస్​ సోమవారం స్కూల్​ను సందర్శించారు. స్కూల్​లో పనిచేసే హిందీ టీచర్​ బంగారు నగ శనివారం కనిపించకపోవడంతో నలుగురు విద్యార్థులను అనుమానించారు. దీంతో పీఈటీ టీచర్ వారిని కర్రతో  చితకబాదారు. కాగా కొద్దిసేపటికే నగ కాంపౌండ్ ​వాల్​వద్ద దొరికింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆఫీసర్లు విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థులు, ఘటనకు కారణమైన టీచర్లను తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రశ్నించారు. టీచర్లతో పాటు ప్రిన్సిపాల్​ప్రేమలత ఈ ఘటనను గోప్యంగా ఉంచడంపై ఎంక్వయిరీ ఆఫీసర్లు అగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎంక్వయిరీ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని మీడియాకు తెలిపారు.

చర్యలు తీసుకోవాలి

హిందీ టీచర్, పీఈటీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్​పై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, టౌన్​ సెక్రటరీ మిట్టపల్లి శ్రీనివాస్, తల్లిదండ్రులు​ డిమాండ్​ చేశారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. స్కూల్​లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.