
భారత నౌకాదళం మరింత బలోపేతం అవుతోంది. భారత నావికాదళంలో కొత్త యుద్ధనౌక 'అర్నాల' చేరింది. యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) సిరీస్ మొదటి యుద్ధనౌక INS అర్నాల.జూన్ 18న విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో INS ఆర్నాలను భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు.ఈ కమిషన్ కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు.
INS ఆర్నాల భారత నావికాదళంలో స్వదేశీంగా నిర్మించిన ముఖ్యమైన యాంటీ-సబ్ మెరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది భారత నౌకాదళం రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. ముఖ్యంగా తీరప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాముల బెదిరింపులను ఎదుర్కొవడంలో ఇది సాయపడుతుంది.
INS అర్నాల భారత నౌకాదళం కోసం నిర్మించిన 8 యాంటీ-సబ్ మెరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW SWC) నౌకల శ్రేణిలో మొదటిది. దీనిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE), కోల్ కతా, L&T షిప్ యార్డ్, కట్టుపల్లి సహకారంతో పబ్లిక్-ప్రైవేట్ పార్టినర్ షిప్ (PPP) మోడల్లో రూపొందించి నిర్మించారు. భారత నౌకాదళానికి 2025 మే 8న ఈ నౌకను అప్పగించారు.
ఆత్మనిర్భర్ భారత్ చొరవలో భాగంగా ఈ నౌకలో 80శాతంపైగా స్వదేశీ భాగాలు ఉపయోగించారు. ఇది భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని, దేశీయ తయారీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.
►ALSO READ | ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సభ్యుల అరెస్ట్
INS అర్నాల ప్రధానంగా తీరప్రాంత జలాల్లో నిఘాకోసం రూపొందించారు. ముఖ్యంగా శత్రు జలాంతర్గాములను గుర్తించేందుకు లేటెస్ట్ అధునాతన సోనార్ సిస్టమ్ అమర్చారు. ఇందులో అభయ్ సిస్టమ్ అనే యాక్టివ్-కమ్-పాసివ్ ఇంటిగ్రేటెడ్ సోనార్ సిస్టమ్ ఉంది. దీనిని DRDOలోని NPOL అభివృద్ధి చేసింది.BEL తయారు చేసింది.
టోవ్డ్ లో-ఫ్రీక్వెన్సీ వేరియబుల్-డెప్త్ సోనార్ (LFVDS): ఇది స్వదేశీంగా అభివృద్ధి చేయబడుతున్న LFVDS వ్యవస్థను కూడా ఉపయోగిస్తుంది. ఇది లోతైన జలాల్లో కూడా జలాంతర్గామిలను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఆయుధాలు (Armament): తేలికపాటి టార్పెడోలు ,ASW రాకెట్లతో సహా యాంటీ-సబ్ మెరైన్ ఆయుధాలను కలిగి ఉంది.అత్యంత నిశ్శబ్ద నౌకలలో ఒకటిగా గుర్తించబడింది. ఇది జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలకు చాలా కీలకమైన లక్షణం. శత్రువులచే గుర్తించబడకుండా పని చేయడానికి సహాయపడుతుంది.
INS ఆర్నాల శక్తి సామర్థ్యాలు..
సెర్చింగ్, రెస్క్యూ:ప్రమాదంలో ఉన్న నౌకలకు లేదా వ్యక్తులకు సహాయం అందించగలదు. గస్తీ, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం వంటివి నిర్వహించగలదు. శత్రు నౌకల కదలికలను నిరోధించగలదు. భారత నావికాదళంలో యుద్ధనౌక 'అర్నాల' చేరికతో నావికాదళ శక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా తీరప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాముల బెదిరింపులను ఎదుర్కొవడంలో ఇది సాయపడుతుంది.