కడెం ప్రాజెక్ట్ పనుల పరిశీలన

కడెం ప్రాజెక్ట్ పనుల పరిశీలన

కడెం, వెలుగు: కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తుల పనులను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్ రావు శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రాజెక్టు ఎస్ఈ రవీందర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించి, నిర్వహణ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి లిఫ్ట్​ పనులన్నీ పూర్తయ్యేలా ప్రాజెక్టును సిద్ధం చేయలని ఆదేశించారు. అన్ని పనులు నాణ్యతతో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓఅండ్ఎం ఎస్ఈ సంజీవ్, మెకానికల్ డివిజన్ ఏఈఈ సంగీత్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ గోవర్దన్, డీఈ సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఎస్ఈ రవీందర్, ఈఈ విఠల్, డీఈ బోజదాస్, ఏఈఈ రవి నాయక్, ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.