OTT Thriller Review: ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 రివ్యూ: ఓటీటీ ట్రెండింగ్‌లో లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్

OTT Thriller Review: ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 రివ్యూ: ఓటీటీ ట్రెండింగ్‌లో లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్

సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ రెండో సీజన్‌తో మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది. రణదీప్ హుడా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ మే 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానుంద. ఈసారి సౌత్ ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. నీరజ్ పాఠక్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ మొత్తం 10 ఎపిసోడ్‌లతో దుమ్మురేపుతోంది.

STF ఆపరేషన్లు, గ్యాంగ్ వార్స్, పొలిటికల్ డ్రామాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. గత సీజన్ కంటే ఈసారి కథ మరింత ఉత్కంఠభరితంగా ఉండటంతో, ఓటీటీలో ఈ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో రణదీప్ హుడాతో పాటుగా ఊర్వశి రౌటెలా, అమిత్ సియాల్, అభిమన్యు సింగ్, షాలిన్ భానోత్, రజనీష్ దుగ్గల్, ఫ్రెడ్డీ దర్వాలా కీలక పాత్రలు పోషించారు

కథేంటంటే:

ఉత్తరప్రదేశ్‌‌లో మాఫియా బాగా విస్తరిస్తుంది. ఏకంగా ముఖ్యమంత్రిని చంపేందుకు ప్రయత్నాలు చేసే స్థాయికి వెళ్తుంది. ఈ క్రమంలో హోం మంత్రి ఆదేశాల మేరకు లక్నో డీజీపీ సమర్ ప్రతాప్ సింగ్ (జాకీర్ హుస్సేన్) సిఫార్సుతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌‌టీఎఫ్​) ఏర్పాటవుతుంది. దానికి ఎన్‌‌కౌంటర్ స్పెషలిస్ట్ అవినాష్ మిశ్రా (రణ్‌‌దీప్ హుడా)ని హెడ్‌‌గా నియమిస్తారు.

అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడే అతని కొడుకు తన క్లాస్‌‌మేట్‌‌ను హత్య చేశాడనే ఆరోపణలు వస్తాయి. ఇంట్లో ఉద్రిక్తతలు మొదలవుతాయి. భార్య పూనమ్ (ఊర్వశి రౌటెలా)తో గొడవ జరుగుతుంది. చివరికి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎస్టీఎఫ్​కు, అవినాష్​ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలకు లింక్‌‌ ఏంటి? తెలియాలంటే ఈ వెబ్‌‌ సిరీస్‌‌ చూడాలి. ..

విశ్లేషణ:

ఈ సీజన్ 2’ మరింత యాక్షన్, ఎమోషన్, పొలిటికల్ డ్రామాతో ముందుకొచ్చింది. ముఖ్యంగా 1990ల నాటి ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో నడిచే కథకు రియలిస్టిక్ టచ్ ఇవ్వడంలో దర్శకుడు నీరజ్ పాఠక్ మరోసారి సక్సెస్ అయ్యారు. ఎస్‌టీఎఫ్ ఆపరేషన్లు, మాఫియా నెట్‌వర్క్, రాజకీయ ఒత్తిళ్లను సహజంగా చూపించారు.

రణదీప్ హుడా ఈ సిరీస్‌కు ప్రధాన బలం. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అవినాష్ మిశ్రాగా ఆయన నటన చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు, ఫ్యామిలీ ఇస్స్యూతో నలిగే వ్యక్తిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఊర్వశి రౌటెలా పాత్ర క్యూరియాసిటీ పెంచింది. 

సీజన్‌లో గ్యాంగ్ వార్స్, రాజకీయ కుట్రలు, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆసక్తిగా సాగినా, కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. కొఅయినప్పటికీ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతుంది. టెక్నికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ ఈసారి సౌత్ ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. ఫైనల్‌గా: క్రైమ్ థ్రిల్లర్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే వారికి ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2’ మంచి బింజ్ వాచ్ అనిపిస్తుంది