Instagram new update: ఇన్‌స్టాగ్రామ్‌ క్వైట్ మోడ్

Instagram new update: ఇన్‌స్టాగ్రామ్‌ క్వైట్ మోడ్

వినియోగదారుల భద్రతా, స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చే ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా క్వైట్ మోడ్‌ అనే ఫీచర్‌‌పై పనిచేస్తుంది. అన్‌నోన్‌ మెసేజ్లతో విసిగిపోయేవాళ్లకు, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవసీ కావాలనుకునేవాళ్లకు ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది. ఇందులోని ఫీచర్లు ఎలా పనిచేస్తాయో వివరిస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..

యూజర్ ప్రొఫైల్ కింద క్వైట్ మోడ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసిన తర్వాత టైమ్, డేట్‌ని సెలక్ట్ చేసి ఆ టైం వరకు క్వైట్‌ అయిపోవచ్చు. అంటే, నిర్దేశించిన టైం అండ్ డేట్‌ వరకు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఎలాంటి మెసేజ్‌లు, నోటిఫికేషన్లు రావు. ఎవరైనా మెసేజ్ చేయడానికి ప్రయత్నిస్తే.. వాళ్లకు ‘యూజర్ క్వైట్ మోడ్‌లో ఉన్నాడు’ అని బాట్ రిప్లై వెళ్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి కేవలం ఎంటర్‌‌టైన్మెంట్ పొందాలనుకునేవాళ్లకు, బిజీ షెడ్యూల్స్ ఉన్నవాళ్లకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బీటా వెర్షన్లో ఉన్న ఈ ఫీచర్‌‌ని త్వరలోనే మిగతా యూజర్లకు అప్‌డేట్ ఇస్తారు.