
ఇప్పుడు రీల్స్ ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. రీల్స్ చేసేవాళ్లు ఎంతమంది ఉంటే.. చూసేవాళ్లు అంతకంటే ఎక్కువే ఉన్నారు. రీల్స్ చూడడం మొదలుపెడితే.. చేతివేళ్లు ఫోన్ మీద నాట్యమాడుతూనే ఉంటాయి. ఒక్కో రీల్ ఉండే టైం నిమిషంలోపే.. కానీ, వరసపెట్టి చూసే వ్యూయర్లకు మాత్రం అస్సలు అలుపురాదు. అంతగా అడిక్ట్ అయిపోయారు అనొచ్చు. అయితే, అడిక్షనో, టైంపాసో.. కాసేపు సేదదీరేందుకు రీల్స్‌కి అలవాటుపడ్డారు. అందుకే రీల్స్ చూసేవాళ్లకోసం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ తీసుకురానుంది.
వేళ్లతో స్క్రోల్ చేసే పనిలేకుండా ఆటో స్క్రోల్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఒక రీల్ పూర్తయ్యాక మరో రీల్ స్ర్కోల్ చేయకుండానే వచ్చేస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. క్రియేటర్లకు ఎక్కువ వ్యూస్ వచ్చే చాన్స్ ఉంది. కొంచెం టైంలోనే ఎక్కువ కంటెంట్ యూజర్ చూస్తే అల్గారిథమ్‌లలో రీచ్ బాగుంటుంది. అయితే ఇది ఉపయోగం కంటే డిజిటల్ వ్యసనానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మనం స్క్రోల్ చేయకుండానే కంటెంట్ ముందుకు పోతే ఎక్కడ ఆగాలి? అనే ప్రశ్న రాదు. ఆగాలన్న ఆలోచన కూడా రాదు. దీంతో యూజర్లు అడిక్ట్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. టెస్టింగ్‌లో సక్సెస్ అయితే త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది.