Russia, Ukraine War: బాణాలతో రష్యా సైనికుల యుద్ధం

Russia, Ukraine War: బాణాలతో రష్యా సైనికుల యుద్ధం

రష్యా, ఉక్రెయిన్  దేశాల దగ్గర అణు బాంబులు, క్షిపణులు లాంటి అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వాటితో ఇరు దేశాలు దాడి చేసుకుంటున్నాయి. వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధంలో కొన్ని సంఘటనలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ రష్యన్ సైనికుడు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వేరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోని రష్యా మంత్రిత్వ శాఖ తన అఫిషియల్ టెలిగ్రామ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది.

తుపాకి, బాంబులకి బదులుగా ఓ రష్యన్ సైనికుడు విల్లు, బాణాలు పట్టుకొని తిరుగుతుంటాడు. ఉక్రెయిన్ సైనికులను వేటాడుతున్నా అని చెప్తూ.. ఖాళీ మైదానంలో విల్లు పట్టుకొని తిరుగుతుంటాడు. ఆ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే గత నెలలో రష్యాపై ఉక్రెయిన్ జరిపిన దాడికి బదులుగా, రష్యా కూడా ఉక్రెయిన్ పై దాడి చేసింది. ఆ దాడిలో ఉక్రెయిన్ సైనికులు 600 మంది చనిపోయినట్లు రష్యా ప్రకటించింది.