గ్లోబల్​ పీస్​ ఇండెక్స్-2023

గ్లోబల్​ పీస్​ ఇండెక్స్-2023

–ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ఎకనామిక్స్​ అండ్​ పీస్​ సంస్థ 2023 సంవత్సరానికిగాను గ్లోబల్​ పీస్​ ఇండెక్స్​ – 2023ను విడుదల చేసింది. 163 దేశాలతో కూడిన ఈ జాబితాలో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్​లాండ్​ (స్కోర్​ 1.124) మొదటి స్థానంలో నిలిచింది. 

2008 నుంచి ఐస్​లాండ్​ ఈ జాబితాలో మొదటి స్థానంలో  కొనసాగుతోంది. రెండో స్థానంలో డెన్మార్క్​ (1.31),  మూడో స్థానంలో ఐర్లాండ్​ (1.312),  నాలుగో స్థానంలో న్యూజిలాండ్​ (1.313), ఐదో స్థానంలో ఆస్ట్రియా (1.316) నిలిచాయి. ఈ జాబితాలో 3.448 స్కోర్​తో ఆఫ్ఘనిస్థాన్​ చివరిస్థానంలో నిలిచింది.  యెమెన్​, సిరియా, సౌత్​ సూడాన్​, డెమొక్రాటిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ కాంగోతోపాటు మరో నాలుగు తక్కువ శాంతియుత దేశాల జాబితాలో చేరాయి.  గ్లోబల్​ పీస్​ ఇండెక్స్​(జీపీఐ)–2023లో భారత్​ 2.314 స్కోర్​తో 126వ స్థానంలో ఉంది. ​