రియల్టీలో తగ్గిన విదేశీ పెట్టుబడులు

రియల్టీలో తగ్గిన విదేశీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లో సంస్థాగత పెట్టుబడులు ఈ ఏడాది జనవరి-మార్చిలో ఏటా 55 శాతం క్షీణించి 552 మిలియన్ల డాలర్లకు తగ్గాయి.ఇన్వెస్ట్​మెంట్ల విషయంలో వీళ్లు ఆచితూచి వ్యవహరిస్తు న్నారు. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వెస్టియన్​ స్టడీ రిపోర్ట్​ ప్రకారం తాజా క్వార్టర్​లో కేవలం 11 మిలియన్​ డాలర్లు పెట్టారు. 2023 క్యాలెండర్ సంవత్సరం జనవరి-మార్చి కాలంలో రియల్ ఎస్టేట్ రంగం  1,238.3 మిలియన్ల డాలర్లను (1.23 బిలియన్​ డాలర్లు) ఆకర్షించింది.  

దేశంలోని రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌లోని విదేశీ నిధుల నుంచి సంస్థాగత పెట్టుబడులు 2024 మొదటి త్రైమాసికంలో 99 శాతం పడిపోయి కేవలం 11 మిలియన్ల డాలర్లకు చేరాయి. ఇవి క్రితం సంవత్సర కాలంలో  791.4 మిలియన్ల డాలర్లు ఉన్నాయి.  వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వాణిజ్య ఆస్తులైన కార్యాలయం, రిటైల్, కో-వర్కింగ్  హాస్పిటాలిటీ ప్రాజెక్టుల్లో మార్చి త్రైమాసికంలో అత్యధికంగా  231.6 మిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్​ చేశారని చెప్పారు. సంవత్సరం క్రితం కాలంలో  484.8 మిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్​ చేశారని వివరించారు.