బీమాతో కుటుంబానికి రక్షణ ..వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్ది

బీమాతో కుటుంబానికి రక్షణ ..వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్ది

వికారాబాద్​, వెలుగు: బీమా కుటుంబానికి రక్షణగా ఉంటుందని వికారాబాద్​  ఎస్​పీ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్  జిల్లా పోలీస్​కార్యాలయంలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్​ అలియన్స్​ ఆధ్వర్యంలో హోంగార్డులకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమాపై  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్​పీ మాట్లాడుతూ.. ఊహించని ప్రమాదం జరిగినప్పుడు బీమా కలిగి ఉండకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. 

జీవిత బీమా ఉంటే కుటుంబ యజమాని మరణిస్తే అతనిపై ఆధారపడ్డ వారికి ఆర్థిక రక్షణ కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.రాములునాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పృథ్వీ అంబాటి, మేనేజర్​ బాలకృష్ణ 
పాల్గొన్నారు.