మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

 

  • అటెండ్ కానున్న 4.26 లక్షల మంది
     
    హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు 4,26,075 మంది హాజరు కానున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 926 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం ఫస్టియర్ స్టూడెంట్లకు, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. 

ఎగ్జామ్స్​కు ఫస్టియర్ విద్యార్థులు 2,72,996 మంది, సెకండియర్ స్టూడెంట్లు 1,53,079 మంది అటెండ్ కానున్నారు. ఈ పరీక్షలకు నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని, కనీసం అరగంట ముందు పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు.