ప్రైవేట్ ఇంటర్ కాలేజీలపై లాక్ డౌన్ ఎఫెక్ట్

ప్రైవేట్ ఇంటర్ కాలేజీలపై లాక్ డౌన్ ఎఫెక్ట్

అఫిలియేషన్ ఆలస్యంతో ఇబ్బంది

నోటిఫికేషన్ రిలీజ్ చేసే సమయంలోనే లాక్డౌన్
మే నెలాఖరులో షెడ్యూల్ ప్రకటించే చాన్స్

హైదరాబాద్,వెలుగు: లాక్డౌన్ ప్రభావం ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్లపైనా పడింది. 2019–20 విద్యా సంవత్సరంలో 1,486 కాలేజీలకు బోర్డు అనుమతులిచ్చింది. రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించే కాలేజీలకు 2020–21 విద్యాసంవత్సరంలో పర్మిషన్ ఇవ్వబోమని గతంలోనే తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే అఫిలియేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు నోటిఫికేషన్
సిద్ధం చేశారు. అదే టైంలో లాక్డౌన్ స్టార్ట్ అవడంతో ప్రాసెస్ ఆగిపోయింది. మే నెలాఖరులో నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జూన్ రెండో వారం వరకు అప్లికేషన్లు స్వీకరించి, తర్వాత తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావాలంటే కనీసం రెండు నెలల సమయం పట్టొచ్చు. జూలై ఆఖరి వారం లేదా ఆగస్ట్ లో కాలేజీల అఫిలియేషన్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత విద్యా సంవత్సరంలో గుర్తింపున్న కొన్ని కాలేజీలు, అనుమతులు ఉన్న చోట కాకుండా మరో చోట క్లాస్లులు నిర్వహించాయి. అఫిలియేషన్లేని కాలేజీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం చేసిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు 79 కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. గతంలో మాదిరిగా కాలేజీలను నామమాత్రంగా పరిశీలించి అఫిలియేషన్లు ఇస్తారా? లేక రూల్స్ కి విరుద్ధంగా ఉన్న కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది.

For More News..

డయల్ 100కి 95 వేల బ్లాంక్ కాల్స్

పండ్ల బుట్టకు ఫుల్ డిమాండ్.. ఒక్కరోజే 2500 ఆర్డర్లు

లారీలు తిరగొచ్చు.. నిబంధనలు ఇవే..

లాక్‌డౌన్‌ కు ‘దయ్యాల’ గస్తీ