ఇంటర్ కాలేజీలు రీఓపెన్

ఇంటర్ కాలేజీలు రీఓపెన్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ముగిశాయి. గురువారం  నుంచి అన్ని ఇంటర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. సెలవులు పూర్తవడంతో రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కాలేజీలు గురువారం  అధికారికంగా రీఓపెన్ కానున్నాయి. మరోపక్క, రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇవ్వలేదు

. బుధవారం రాత్రి వరకు మొత్తం  2,705 జూనియర్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చినట్లు బోర్డు తన వెబ్ సైట్​లో  పేర్కొన్నది. స్టేట్​లో సుమారు 1500 వరకు ప్రైవేటు కాలేజీలు ఉండగా, వాటిలో కేవలం 1085 కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ ఇచ్చారు.  కాగా, 2023–24 విద్యాసంవత్సరంలో మొత్తం 227 వర్కింగ్ డేస్ ఉంటాయని ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది.