ఇంటర్ ఎగ్జామ్ ఫీజు ఖరారు.. 14 దాకా చెల్లించేందుకు అవకాశం

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు ఖరారు.. 14 దాకా చెల్లించేందుకు అవకాశం

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫీజు, చెల్లింపు తేదీలు ఖరార య్యాయి. ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు  ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు పే చేయొచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. వంద రూపాయల ఫైన్​తో నవంబర్ 16 నుంచి 23 దాకా, రూ.500 ఫైన్​తో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 దాకా ఫీజు చెల్లించొచ్చని చెప్పారు. 

రూ.వెయ్యి ఫైన్​తో డిసెంబర్ 6 నుంచి 13 దాకా, రూ.2వేల ఫైన్​తో డిసెంబర్ 15 నుంచి 20 దాకా ఫీజు చెల్లించేందుకు చాన్స్ ఉందని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ కోర్సుల స్టూడెంట్లకు రూ.510 ఎగ్జామ్ ఫీజు ఉంటుందని, ఒకేషనల్ కోర్సుల స్టూడెంట్లకు రూ.730 ఫీజు అని పేర్కొన్నారు.

ఇంగ్లిష్ సబ్జెక్టులో ‘ఎథిక్స్’ విలీనం 

ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు ఈ ఏడాది నుంచి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ ను నిర్వహించడం లేదని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అయితే, ఆ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్​ను ఇంగ్లిష్ లో కలుపుతున్నట్టు పేర్కొన్నారు. పబ్లిక్​ పరీక్షలోనే ఎథిక్స్ సిలబస్ పెట్టడం ద్వారా స్టూడెంట్లు అది తప్పకుండా చదువుతారని, అందుకే ఇంగ్లిష్​లో చేర్చినట్టు ఇంటర్ ఎగ్జామ్స్ బోర్డు కంట్రోలర్ జయప్రద బాయి తెలిపారు. దీనిపై వచ్చేనెల 2 నుంచి లెక్చరర్లకు ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు.