
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు గడువు షెడ్యూల్‌ను బోర్డు మంగళవారం రిలీజ్ చేసింది. అన్ని కాలేజీల ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ స్టూడెంట్లు, ప్రైవేటు స్టూడెంట్లు ఈనెల 5 నుంచి 24 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రూ.100 ఫైన్‌తో ఈ నెల 25 నుంచి 31వరకు, రూ.500 ఫైన్‌తో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు, రూ.1,000 ఫైన్‌తో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు, రూ.2 వేల ఫైన్‌తో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పింది. ఇక, అక్టోబర్‌లో జరిగిన ఫస్టియర్ ఎగ్జామ్స్‌లో పాసైన స్టూడెంట్లకు ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అవకాశమిస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపల్స్ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.