
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన శనివారం హైదరాబాద్ లో జరిగింది.రాయదుర్గం పరిధిలోని చిత్రపురికాలనీకి చెందిన హిందూశ్రీ(18) ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో హిందూశ్రీ ..అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచాం అందుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ హస్పిటల్ కు తరలించారు.
విద్యార్థిని సూసైడ్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద చదువులు చదువుకుని మంచి పేరు తెచ్చుకుంటుందనుకున్న తమ కూతురు ..తమ ఆశలన్నీ అడియాశలు చేసిందంటూ కన్నీరుమున్నీరయ్యారు హిందూశ్రీ తల్లిదండ్రులు.