ఇంటర్ రిజల్ట్స్: పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాలు

ఇంటర్  రిజల్ట్స్: పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాలు

ఇంటర్మీడియట్.. విద్యార్ధుల భవిష్యత్ లో చాలా కీలకమైంది. ఇంటర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంసెట్ పరీక్షలో 25 శాతం వెయిటేజ్ ఇవ్వడంతోపాటు… దేశ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రవేశ పరీక్షలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఈసారి ఇంటర్ ఎగ్జామ్ ను రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వ తేదీ వరకు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 42 వేల 789 స్టూడెంట్స్ పరీక్ష రాశారు. సిస్టమ్ నామ్స్ ప్రకారం ఎగ్జామ్ అయిన 45 రోజుల్లో రిజల్ట్ ఇవ్వాలి. అయితే ఈసారి రిజల్ట్స్ తొందరగా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 18 లక్షల మంది ఇంటర్ ఎగ్జామ్స్ రాసేవారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో 9 లక్షలపైనే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. పేపర్ వాల్యూయేషన్ కోసం 25 వేల మంది ఎగ్జామినర్స్ ను  అపాయింట్ చేశారు. వీరిపైన 5వేల మంది ఛీఫ్ ఎగ్జామినార్స్ ను ఉంచారు. ఒక్కో ఎగ్జామినార్ రోజుకు 30 పేపర్లు దిద్దేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం సగం, సాయంత్రం సగం పేపర్లు దిద్దాలి. ఒక్కో పేపర్ కు 15 రూపాయల 10 పైసలు ఎగ్జామినార్ కు ఇస్తారు. ఈ సిస్టమ్ నామ్స్  ప్రకారం రిజల్ట్ ను ఇవ్వాలి.

ఫలితాలివ్వడంలో రెండు  రాష్ట్రాల మధ్య పోటీతో… ఎవరు ముందు రిజల్ట్ ఇస్తే వారే గ్రేట్ అన్నట్లు తయారైంది. దీంతో ఎక్కడా నిబంధనలను పాటించడం లేదనే విమర్శలొస్తున్నాయి. రోజుకు 30 పేపర్లు దిద్దాలనే నిబంధన ఉన్నప్పటికి 40 నుంచి 50 దిద్దిస్తున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే విద్యార్ధులు నష్టపోయే పరిస్ధితి కనిపిస్తోందంటున్నారు విద్యార్థి సంఘం నాయకులు. ఛాలెంజింగ్ రివాల్యూయేషన్ కు పెట్టిన 8 వందల రూపాయల ఫీజుని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో 30 పేపర్స్ కి మించి కరెక్షన్ చేసే కెపాసిటీ అధ్యాపకులకు లేదంటున్నారు తెలంగాణ  జూనియర్ లెక్చరర్స్ ఫోరమ్ అధ్యక్షులు. రిజల్ట్స్ విషయంలో తాము 3 నుంచి 4 ఏళ్లుగా 20 పేపర్లు మాత్రమే దిద్దించాలని కోరుతున్నా… ఎవరూ పట్టించుకోవట్లేదంటున్నారు.

వాయిస్: రిజల్ట్స్ తొందరగా ఇవ్వాలనే తొందరతో పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దంటున్నారు విద్యావేత్తలు. ప్రతి మార్కు విద్యార్థుల భవిష్యత్తులో ఎంతో కీలకమంటున్నారు.