
తోట రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం'ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు'. ఒక వినూత్న టైటిల్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు మూవీ మేకర్స్ తెలిపారు.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇద్దరు యువకులు, యువతి మధ్య జరిగే ప్రేమ , అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ఉంటుందని దర్శకనిర్మాత రామకృష్ట తెలిపారు. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని వివరించారు.
ఈ సినిమా ముఖ్యపాత్రల్లో యువ నటులు సిద్ధార్థ్ మీనన్, దిలీప్, రాశి సింగ్ నటించారు. వీరితో పాటు రఘుబాబు, కాశిరెడ్డి రాజ్కుమార్, వీర శంకర్, గౌతమ్ రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవి తేజ, రాజిత వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మోహిత్ రహమానియాక్ సంగీతం అందించారు.
►ALSO READ | OTTలోకి 'సైయారా'.. రొమాంటిక్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ చిత్రానికి పాటలు రాశారని తెలియడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఆయనతో పాటు సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల వంటి ప్రఖ్యాత గీత రచయితలు కూడా పాటలు అందించారు. రామకృష్ణ తోట ఈ చిత్రానికి రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస రాజు , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శరత్ వర్మ, ఎడిటర్ గా గన్ పనిచేశారు.