- 64 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ చోరీ
నిజామాబాద్, వెలుగు: పలు జిల్లాలో ట్రాన్స్‌పార్మర్లలోని కాపర్వైర్చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సీపీ పి.సాయిచైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ బైపాస్‌వద్ద గురువారం సాయంత్రం వెహికిల్స్తనిఖీ చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకొని తనిఖీ చేయగా ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొరికాయన్నారు.
ఎంక్వైరీ చేయగా బోధన్, మెదక్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 64 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్‌ను చోరీ చేశారు. చోరీలకు పాల్పడుతున్న మనం సాయిలు, జగన్నాథం సారయ్య, వనం పోశెట్టి, ధనశ్రీ కిరణ్, దాసరి పోచయ్యను అరెస్ట్‌చేసినట్లు సీపీ తెలిపారు. వారి వద్ద నుంచి వస్తువులను కొనుగోలు చేసిన అక్బర్‌హుస్సేన్, షేక్మహబూబ్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 80 కిలోల రాగి కాయిల్స్, 3 బైక్‌లు, 4 మొబైల్స్స్వాధీనం చేసుకున్నారు.
