
కుషాయిగూడ, వెలుగు: ఇంటర్ఫెయిల్అయ్యాననే బాధతో ఓ స్టూడెంట్ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. కుషాయిగూడ పరిమళానగర్లో కర్రపాటి మురళీధర్కుటుంబంతో ఉంటున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందన మురళీధర్ భార్య చెల్లెలి కొడుకు ఏ. శరత్‌బాబు (17)ను తల్లిదండ్రులు ఇక్కడ చదివిస్తున్నారు. గురువారం ఇంటర్ ఫలితాలు ప్రకటించగా శరత్ఫెయిల్అవడంతో మురళీధర్మందలించాడు. అదే రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తెలిసిన వారిని, శరత్ ఫ్రెండ్స్వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియలేదు. వెంటనే కుషాయిగూడ పోలీసులకు కంప్లయింట్ చేయగా మిస్సింగ్‌కేసు ఫైల్ చేశామని ఎస్ఐ మదన్ లాల్చెప్పారు.