
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఇంటర్ బోర్డుకు సెక్రటరీని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఇంటర్ విద్యా జేఏసీ కోరింది. ఇంటర్ విద్యావ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిందని పూర్తి సమయమిచ్చి పనిచేసే అధికారిని కార్యదర్శిగా నియమించాలని జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాల యానికే పరిమితమైన రెవెన్యూశాఖ సెక్రటరీ నవీన్ మిట్టల్ ప్రస్తుతం ఇంటర్ బోర్డు ఇన్ చార్జీ సెక్రటరీగా ఉన్నారని గుర్తుచేశారు. ఆయన ఆరు నెలలకోసారి కూడా ఆఫీసుకు రావడం లేదన్నారు. పర్యవేక్షణ లేక ఇంటర్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందని సీఎంకు వివరించారు.