HDFC కి రూ.2,862 కోట్ల లాభం

HDFC కి రూ.2,862 కోట్ల లాభం
  • 19%  పెరిగిన వడ్డీ ఆదాయం

తనఖా రుణాలు ఇచ్చే హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.2,862 కోట్ల లాభాలు సాధించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం క్యూ4 లాభం రూ.2,257 కోట్లతో పోలిస్తే ఇది 26.8 శాతం అధికం. మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.9,322 కోట్ల నుంచి రూ.11,586 కోట్లకు పెరిగింది. తాజా క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ.3,161 కోట్లకు ఎగిసింది. ఇది గత క్యూ4లో రూ.2,650 కోట్లుగా నమోదయింది. ప్రతి షేరుకు రూ.17.50 చొప్పున తుది డివిడెండ్‌‌‌‌‌‌‌‌ చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. రూ.3.50 చొప్పున మధ్యంతర డివిడెండ్‌‌‌‌‌‌‌‌ కూడా చెల్లించాలని పేర్కొంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో షేరు రూ.20 చొప్పున డివిడెండ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా, ఈసారి అది రూ.21కి పెరిగింది. వ్యాపార విస్తరణ కోసం రూ.1.25 లక్షల కోట్ల విలువైన రిడీమబుల్‌‌‌‌‌‌‌‌ నాన్‌‌‌‌‌‌‌‌ కన్వర్టబుల్‌‌‌‌‌‌‌‌ డిబెంచర్లు జారీ చేయాలని హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ నిర్ణయించింది. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విధానంలో వీటిని జారీ చేస్తారు. నాజర్‌‌‌‌‌‌‌‌ ముంజీ, జేజే ఇరానీలను ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్లుగా మరోసారి నియమించాలన్న ప్రతిపాదనను కూడా కంపెనీ ఆమోదించింది. వీరి నియామకం ఈ ఏడాది జూలై 21 నుంచి అమల్లోకి వస్తుంది.

ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ప్రమాణాల ప్రకారమే..

2017, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచి స్టాండ్‌‌‌‌‌‌‌‌ఎలోన్‌‌‌‌‌‌‌‌, కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను ఇండియన్‌‌‌‌‌‌‌‌ అకౌంటింగ్‌‌‌‌‌‌‌‌ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌ (ఐఏఎస్‌‌‌‌‌‌‌‌) ప్రకారమే విడుదల చేస్తున్నట్టు హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ తెలిపింది. ఇదిలా ఉంటే, కంపెనీకి 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.10,959 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 12 శాతం తగ్గి రూ.9,632 కోట్లకు పడిపోయింది. కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన లాభం రూ.13,111 కోట్ల నుంచి రూ.17,580 కోట్లకు పెరిగింది. 2018లో ఐపీఓ నిర్వహించినందున ఆ ఏడాది అంకెలను గత ఆర్థిక సంవత్సరం అంకెలతో పోల్చిచూడదని హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ కోరింది. మొత్తం ఆదాయం కూడా కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన చూస్తే రూ.79,819 కోట్ల నుంచి రూ.96,194 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 18 శాతం పెరిగి రూ.9,635 కోట్ల నుంచి రూ.11,403 కోట్లకు చేరింది. అసెట్‌‌‌‌‌‌‌‌ క్వాలిటీని పరిశీలిస్తే, స్థూల ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలు తాజా క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.4,777 కోట్లుగా నమోదయ్యాయి. లోన్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోలో ఇవి 1.18 శాతం. ఇండివిజువల్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోలో ఎన్‌‌‌‌‌‌‌‌పీఏ లోన్ల విలువ 0.70 శాతం కాగా, నాన్‌‌‌‌‌‌‌‌–ఇండివిజువల్‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోలో ఎన్‌‌‌‌‌‌‌‌పీఏ లోన్ల విలువ 2.30 శాతం ఉంది. నికర వడ్డీ మార్జిన్‌‌‌‌‌‌‌‌ గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే 3.3 శాతం నమోదయింది. క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ అడెక్వసీ రేషియో 19.2 శాతం ఉంది. ఇందులో టైర్‌‌‌‌‌‌‌‌ 1 క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ 17.6 శాతం కాగా, టైర్‌‌‌‌‌‌‌‌ 2 క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ 1.6 శాతం. నిబంధనల ప్రకారం టైర్‌‌‌‌‌‌‌‌ 1 క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ 12 శాతం, టైర్‌‌‌‌‌‌‌‌ 2 క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ 6 శాతం ఉండాలి.