International Tiger day2025: పులుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. మీకోసం..

International Tiger day2025:   పులుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. మీకోసం..

టైగర్లు (పులులు) శక్తివంతమైన, చారల జంతువులు..  ఇవి ఆసియాకు చెందినవి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లి జాతికి చెందినవి.  అంతర్జాతీయ టైగర్ డే సందర్భంగా ( జులై 29) పులుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ..

పులులు చాలా పెద్దవిగా ఉంటాయి. అయితే  ఆడ పులుల కంటే మగ పులులు పెద్దవిగా ఉంటాయి. ఇవి ఎక్కువుగా  అడవులు, గడ్డి భూములు, మరియు చిత్తడి నేలలు వంటి వివిధ రకాల ఆవాసాలలో నివసిస్తాయి. 
ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య బాగా తగ్గిపోయింది.  ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిగణించబడుతున్నాయి.  అందుకే ప్రతి ఏటా జులై 29 న అంతర్జాతీయ టైగర్ డేను జరుపుకుంటున్నారు.

Also read:- రాజసానికి, గాంభీర్యానికి నిలువెత్తు నిదర్శనం.. పులిలా బతకాలంటే..!

  • పులుల్లో చాలా అరుదైన జాతి రాయల్ బెంగాల్ టైగర్.. దీన్ని పెద్ద పులి అంటారు. ఇది మన దేశం లో తప్ప ఇంకెక్కడా కనిపించదు. బెంగాల్ టైగర్ గాడ్రింపు సుమారు రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఇవి రోజుకు దాదాపు 21 కిలోల మాంసాన్ని తింటాయి.
  • పులులు అడవిలో వాటి సరిహద్దులను అవే ఏర్పాటు చేసుకుంటాయి. ఆ సరిహద్దులకు లోపల వున్న ప్రాంతమంతా వాటి సామ్రాజ్యమే. ఆ సరిహద్దులు దాటి ఏ ఇతర జంతువులు ప్రవేశించినా వాటికి మరణమే.
  • పులి ఒంటి మీద దాదాపుగా వంద చారలు ఉంటాయి. ఏ రెండు పులుల ఒంటి మీది చారలూ ఒకేలా ఉండవు.
  • పులులు సంచరించే దేశాలు, ప్రాంతాలను బట్టి వాటి లక్షణాల్లో కూడా తేడా ఉంటుంది. ఆసియాలోని పెద్ద పిల్లులు (బ్రిగ్ క్యాట్స్) వాసనని బట్టి కాకుండా చూపును. బట్టి, ధ్వనిని బట్టి వేటాడతాయి.
  • ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో ఆడ పులి రెండు నుంచి నాలుగు పిల్లల్ని పెడుతుంది. పులులు పుట్టిన 18 నెలల నుంచే వేటాడటం మొదలు పెడతాయి.
  • పులుల యావరేజ్ లైఫ్ టైం ఇరవై ఏళ్లు.. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం పులులు రెండేళ్ళకు మించి బతకట్లేదు.
  • సైబీరియాలోని అమూర్ టైగర్ అనే అతిపొడవైన మగ పులిజాతులు 300
  • కేజీల బరువుంటాయి. చిన్నవైన సుమత్రా టైగర్ ఉపజాతులు 140 కేజీలు ఉంటాయి. అయితే అన్ని పులుల్లోనూ మగ పులులు ఆడ పులులకంటే బరువు ఎక్కువగా ఉంటాయి.
  • చూడటానికి ఒకేలా ఉన్నా పులులన్నీ ఒకే రకంగా ఉండవు. భారతదేశపు పులుల కంటే కూడా రష్యాపులుల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది.
  • ఒక్కోపులి ఒక్కసారి దాదాపు 40 కిలోల మాంసాన్ని తినగలదు. వీటికి మనుషులకంటే ముప్పయి రెట్లు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఇవి సాధారణంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి.
  • పులి సుమారు 11 అడుగుల పొడవు, 300 కిలోల బరువు ఉంటుంది. 3 మీటర్ల దూరం వరకు దూకగలవు. గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి.
  • పులులు చాలా బాగా ఈదుతాయి. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నపుడు నీళ్లలోనే సేదతీరుతాయి.