
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power star Pawan kalyan) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సురేందర్ రెడ్డి(Surendar reddy) దర్శకత్వంలో పవన్ చేయనున్న సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటీ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కంబోకి సంబంధించిన మూవీపై అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ బేస్డ్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ జానర్ లో రానున్న ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే. ఈ సినిమాకు ఒకడే ఇద్దరు కదా అనే ఇంట్రెసింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్. హైదరాబాద్ మాఫియా బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ అండర్ వరల్డ్ డాన్ గా, పోలీస్ అధికారిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని సంచారం. అంతేకాదు ఈ సినిమాలో పవన్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండనుందట. మునుపెన్నడూ కనపడని సరికొత్త అవతారంలో, సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో ఆడియన్స్ ను అలరించనున్నారట పవన్ కళ్యాణ్. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ గానీ, అనిరుధ్ గానీ సంగీతం ఆడించనున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ న్యూస్ తెల్సుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.