విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు డాక్టర్ల బృందం

ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి, భయం, పరీక్షలకు సంబంధించిన పలు సమస్యలను తీర్చేందుకు డాక్టర్ల బృందంతో కూడిన హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైనా విద్యార్థులు ఈ సమస్యలను ఎదుర్కొంటే తాము అందుబాటులో ఉంచిన వైద్యులకు ఫోన్ చేసి సూచనలు పొందవచ్చని తెలిపింది. ఈ విధానం వల్ల విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించొచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారు. ఈ హెల్స్ డెస్క్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బోర్డు ఏర్పాటుచేసిన వైద్యుల బృందం

  1. డాక్టర్ మజార్ అలీ, సీనియర్ సైక్రియాట్రిస్ట్-9154951977
  2. డాక్టర్ రజినీ, క్లినికల్ సైకాలజిస్ట్-9154951695
  3. పీ. జవహర్ లాల్ నెహ్రూ, క్లినికల్ సైకాలజిస్ట్-9154951699
  4. ఎస్. శ్రీలత, క్లినికల్ సైకాలజిస్ట్-9154951703
  5. పిసపాటి శైలజ, క్లినికల్ సైకాలజిస్ట్-9154951706
  6. గుట్టిందీవి అనుపమ, క్లినికల్ సైకాలజిస్ట్-9154951687
  7. డాక్టర్ ఆరె అనిత, క్లినికల్ సైకాలజిస్ట్-9154951704