
ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగాయనీ త్రిసభ్య కమిటీ నుంచి విద్యాశాఖ సెక్రటరీ దాకా అందరూ అంగీకరించారు. హైకోర్టు కూడా అదే విషయం చెప్పింది. కానీ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌కు మాత్రం తప్పులేవీ కన్పించడం లేదు! నిత్యం ఏదో ఒక ప్రెస్ నోట్ పంపిస్తూ తమ తప్పేమీ లేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరికిబోర్డు నిర్లక్ష్యానికి బలైన విద్యార్థులనూ వదల్లేదు. వాళ్ల ఆత్మహత్యలకు, తమకు ఎలాంటి సంబంధంలేదని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. తప్పంతా పిల్లలేదనీ, బోర్డుదేమీ లేదని చెప్పుకొచ్చారు. అదే నిజమైతే ఇంటర్ రిజల్ట్ వచ్చి 20 రోజులైనా స్టేట్ లో ఇంకా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయని స్టూడెంట్లు, పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.
‘‘వాళ్ల తప్పేమీ లేకుంటేఇంటర్ బోర్డు ఇంకా పోలీస్ పహారాలోనే ఎందుకున్నట్టు? మంచిర్యాల జిల్లాలో ఇద్దరు లెక్చరర్లపై ఎందుకు చర్యలు తీసుకున్నట్టు? రీవెరిఫికేషన్ , రీకౌంటింగ్ లోవిద్యార్థు ల మార్కుల్లో మార్పు లు ఎందుకొస్తున్నట్టు ?తప్పులేవీ జరగకుంటే గ్లో బరీనాతోపాటు మెథడిక్స్ సంస్థతో సమాంతరంగా ఎందుకు రిజల్ట్స్ ప్రాసెస్ చేయిస్తున్నట్టు ’’ అని వారు నిలదీస్తున్నారు.
త్రిసభ్య కమిటీ రిపోర్టు తప్పా?
ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ఎన్నో అవకతవకలుఉన్నట్టు స్పష్టంగా రిపోర్టులో చెప్పింది. గ్లో బరీనాతో అధికారిక ఒప్పందం లేకుండానే రిజల్ట్స్ ప్రాసెసింగ్ కు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అడ్మిషన్లు , ఫీజులచెల్లింపు, హాల్ టికెట్ల జారీ ఇలా అన్నింట్ లో తప్పులొచ్చాయనీ, అయినా గ్లో బరీనాకు కనీసం ఒక్క నోటీస్‌కూడా ఇవ్వలేదని పేర్కొంది. అయినా గ్లో బరీనాసూపర్ అంటూ అశోక్ నాలుగు పేజీల నోట్ నుమీడియాకు విడుదల చేశారు. మొత్తంగా పిల్లలకు ఆత్మస్తైర్యం ఇవ్వడం మాని, రాజకీయ నేతల విమర్శలకు, మీడియాలో వచ్చే కథనాలను ఖండించేందుకే అశోక్‌కు మార్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి పరిమితమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.