
నరేష్ అగస్త్య హీరోగా విపిన్ దర్శకత్వంలో ఉమాదేవి కోట నిర్మించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. ఆగస్టు 22న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు విపిన్, ఉమాదేవి మాట్లాడుతూ ‘ప్రేమ ఇన్‌స్పైర్‌తో పాటు కొన్నిసార్లు ఇన్‌ప్లూయెన్స్ కూడా చేస్తుందని ఇందులో చూపిస్తున్నాం.
హీరోది మ్యూజికల్‌గా ప్రూవ్ చేసుకోవాలనుకునే క్యారెక్టర్. దీనికోసం ట్రావెన్ కోర్ ప్రిన్స్‌ని నటింప చేయడం జరిగింది. ఆయన శాస్త్రీయ సంగీతం కోసం చేసిన సేవ మనం ఊహించలేము. హీరో గ్రాండ్ మదర్‌గా రాధిక శరత్‌కుమార్ కనిపిస్తారు. ఇందులో ఆవిడ చాలా మంచి సింగర్. కానీ కొన్ని కారణాల వల్ల పాడడం మానేసి ఫ్యామిలీ లైఫ్ గడుపుతారు. హీరో క్యారెక్టర్‌ని ఇన్‌స్పైర్ చేసే పాత్రలో కనిపిస్తారు.
సుమన్, తనికెళ్ల భరణి, ఆమని, తులసి, వెంకటేష్ కాకుమాను పాత్రలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. జస్టిన్ ప్రభాకర్ స్లో పాయిజన్ లాంటి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ వచ్చిందని ఆడియెన్స్ ఫీల్ అవుతారు. ఇందులోని రియల్ ఎమోషన్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారు’అని చెప్పారు.
నరేష్ అగస్త్య మూవీస్:
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో కూడిన లిమిటెడ్ బడ్జెట్ మూవీస్‌తో నటుడిగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు నరేష్ అగస్త్య. మత్తువదలరా మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు నరేష్ అగస్త్య. వికటకవి వెబ్ సిరీస్, కలి, మాయలో, కిస్మత్, మెన్ టూ, పంచతంత్రంతో పాటు మరికొన్ని తెలుగులో సినిమాల్లో హీరోగా కనిపించాడు.