హైదరాబాద్ వెళ్లొచ్చేసరికి.. టీటీడీ అధికారి ఇంట్లో చోరీ.. రూ.15 లక్షల విలువలైన బంగారం, వెండి మాయం

హైదరాబాద్ వెళ్లొచ్చేసరికి.. టీటీడీ అధికారి ఇంట్లో చోరీ.. రూ.15 లక్షల విలువలైన బంగారం, వెండి మాయం

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ లో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు దుండగులు. ఇంట్లో ఉన్న దాదాపు 15 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి నగలను ఎత్తుకెళ్లారు. 

తిరుపతి  ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగిపట్టేడలో ఆదివారం (ఆగస్టు 17) తెల్లవారుజామున జరిగింది ఈ చోరీ.  టీటీడీ దేవస్థానం లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు  ఇంట్లో జరిగింది దొంగతనం.  మొత్తం 207 గ్రాముల బంగారం,466 గ్రాముల వెండి నగలు అపహరించారు దొంగలు. 

►ALSO READ | శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తిరుపతి వెళ్లే ఫ్లైట్లో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం

హైదరాబాదులో నివాసం ఉంటున్న కూతురు వద్దకు 14వ తేదీన వెళ్లి 18 న తిరుపతికి వచ్చారు. ఇంటి తలుపులు తెరచి  ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న క్రైమ్ డీఎస్పీ శ్యాంసుందర్ క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.  బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు తిరుపతి సీసీఎస్ సీఐ ప్రకాష్ కుమార్.