శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తిరుపతి వెళ్లే ఫ్లైట్లో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తిరుపతి వెళ్లే ఫ్లైట్లో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు ఎయిర్ పోర్టు అధికారులు. మంగళవారం (ఆగస్టు 19) తిరుపతి వెళ్లే ఫ్లైట్లో సాంకేతిక లోపం రావడంతో విమానాన్ని ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

హైదరాబాద్ నుంచి- తిరుపతి వెళ్తున్న అలియన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్థించారు పైలెట్లు. తిరిగి శంషాబాద్‌ విమానశ్రయంలో ల్యాండింగ్‌ చేశారు. 

బోర్డింగ్ అయిన 67 మంది ప్రయాణికులను కిందికి దించడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు.  ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ఎదురు చూస్తున్నారు.