ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే యోచనేలేదు

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే యోచనేలేదు
  • ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్

హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే ఆలోచనేలేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. రేపో మాపో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగని విషయం తెలిసిందే. ఈసారి కూడా గతేడాది తరహాలోనే ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేస్తారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. గత ఏడాది కరోనా వల్ల  కేవలం 45 రోజులే తరగతులు  జరిగినందున పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 
ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదని.. జూన్ నుంచే ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయని.. అలాగే సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కరోనా ప్రభావంతో ఈ సారి కేవలం 14 రోజులే కాలేజీలు నడపలేదని.. ఈనెల 1 నుంచి మళ్లీ తరగతులు మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు గందరగోళానికి అవకాశం లేకుండా షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. ఎప్పటిలాగే వార్షిక పరీక్షలకు ముందే ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వివరించారు. 

 

ఇవి కూడా చదవండి: 

రాష్ట్రంలో ఇవాళ  కొత్త కేసులు 2,098, మరణాలు 2

మోడీ వచ్చాక దేశ ప్రజలు తలెత్తుకుని బతుకుతున్నారు

స్కూల్స్ రీఓపెన్ చేయండి.. లేకుంటే ఓటేయ్యం

యోగి వద్ద కోటిన్నర ఆస్తులు, రివాల్వర్‌‌, రైఫిల్