రేపే ఇంటర్ ఫలితాలు

రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్మీడియట్ రిజల్ట్స్  విడుదలకు అంతా సిద్దమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను http://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలను మేలో నిర్వహించారు. మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు. 70శాతం సిలబస్ తోనే పరీక్షలు జరిగాయి. వాస్తవానికి ఎగ్జామ్స్ పూర్తయిన నెల రోజుల్లోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డ్ గతంలో వెల్లడించింది. అయితే ఇంటర్ ఫలితాల విడుదల పలుసార్లు వాయిదా పడడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎట్టకేలకు మంగళవారం విడుదల అవుతుండడంతో విద్యార్థుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది.