మహిళల ఆత్మకథలు, -జీవిత చరిత్రలు.. సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తయ్

మహిళల ఆత్మకథలు, -జీవిత చరిత్రలు.. సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తయ్
  • ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
  • మహిళా వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

బషీర్​బాగ్, వెలుగు: కోఠిలోని మహిళా వర్సిటీలో ‘మహిళల ఆత్మకథలు, -జీవిత చరిత్రలు – సమాలోచనం’ అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. తెలుగు శాఖ, రూసా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రారంభ సభకు వీసీ సూర్యా ధనంజయ్ అధ్యక్షత వహించారు. ముఖ్య​అతిథిగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. మహిళల ఆత్మకథలు, జీవిత చరిత్రలు సమకాలీన సమాజానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయన్నారు. నేటి తరానికి నిన్నటి చరిత్ర తెలిసినప్పుడే రేపటి భవిష్యత్తుకు పటిష్టమైన అడుగులు పడతాయన్నారు.

మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, రేపటి భవిష్యత్తు నేటి విద్యార్థినులదేనని స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ, సావిత్రిబాయి పూలే, మాలావత్ పూర్ణ వంటి మహానీయుల జీవన ప్రయాణాలు అనేక మందికి దారిదీపంలా నిలుస్తాయని చెప్పారు. సాగి కమలాకర శర్మ, కాత్యాయని విద్మహే, ప్రిన్సిపల్ డా. లోకపావని, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.