ఎన్నికల టైమ్‌‌‌‌లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్​

ఎన్నికల టైమ్‌‌‌‌లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్​

న్యూఢిల్లీ: ఎన్నికల సంవత్సరంలోనూ ఆర్థిక క్రమశిక్షణను ఇండియా పాటిస్తోందని  ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్‌‌‌‌) కొనియాడింది. ఇండియన్ ఎకానమీ బాగుందని, ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశ ఎకానమీ స్ట్రాంగ్‌‌‌‌గా ఉందని తెలిపింది.  ‘ప్రస్తుతం ఇండియన్ ఎకానమీ బాగుంది. జీడీపీ గ్రోత్ రేట్‌‌‌‌ 6.8 శాతం దగ్గర ఉంది. ఇన్‌‌‌‌ఫ్లేషన్ దిగొస్తోంది. ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ తగ్గించడంపై మనం ఫోకస్ పెట్టాలి. ఇండియా ఎకానమీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌‌‌‌గా ఉన్నాయి’ అని  ఐఎంఎఫ్‌‌‌‌ డైరెక్టర్ (ఏషియా పసిఫిక్‌‌‌‌) కృష్ణ శ్రీనివాసన్‌‌‌‌ అన్నారు.  

ఎన్నికల టైమ్‌‌‌‌లో చాలా దేశాలు అతిగా ఖర్చు చేస్తాయని, ఆర్థిక క్రమశిక్షణ ఉండదని ఆయన అన్నారు. కానీ, ఇండియా మాత్రం ఎన్నికల టైమ్‌‌‌‌లోనూ ఆర్థిక క్రమశిక్షణను ఫాలో అవుతోందని చెప్పారు. ఇది చాలా కీలకమని, ఆర్థికంగా బలంగా ఉంటేనే ఏ దేశమైన డెవలప్‌‌‌‌ అవుతుందని వివరించారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా ఇండియా ఎదిగిందని అన్నారు.  వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు పెరగడంతో 2024–25 లో ఇండియా ఎకానమీ  6.8 శాతం వృద్ధి చెందుతుందని  అంచనా వేశామన్నారు. ఇన్‌‌‌‌ఫ్లేషన్ నిలకడగా దిగొస్తోందని,  ప్రస్తుతం 5 శాతానికి దిగువకు వచ్చిందన్నారు.  గ్లోబల్‌‌‌‌ సమస్యలతో  షార్ట్ టెర్మ్‌‌‌‌లో  కమోడిటీల ధరలు పెరగొచ్చని, వాతావరణ సమస్యలు వంటివి ఎకానమీపై నెగెటివ్ ప్రభావం చూపుతాయని కృష్ణ శ్రీనివాసన్‌‌‌‌ అన్నారు. మరోవైపు  వినియోగం, క్యాపెక్స్  మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం ఇండియా ఎకానమీ మంచి పొజిషన్‌‌‌‌లో ఉందని వెల్లడించారు. 

సమస్యలు ఉన్నా మంచి స్థాయిలోనే 
గ్లోబల్‌‌‌‌గా సమస్యలు ఉన్నప్పటికీ ఇండియా ఎకానమీ స్ట్రాంగ్‌‌‌‌గా ఉందని, గత ఏడాది కాలంగా మంచి గ్రోత్ నమోదు చేస్తోందని వరల్డ్ బ్యాంక్‌‌‌‌ కమిటీకి  ఇండియన్ ఎకనామిక్ అఫైర్స్‌‌‌‌ మాజీ సెక్రెటరీ అజయ్ సేత్‌‌‌‌ వివరించారు. వినియోగం, పెట్టుబడులతో  ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని అన్నారు.  2023–24 కు గాను   జీడీపీ వృద్ధి అంచనాలను  7.3 శాతం నుంచి 7.6 శాతానికి  ప్రభుత్వం సవరించింది.  గ్లోబల్‌‌‌‌ ఎకానమీ మందగించినా, 2023–24 లోని వరుస మూడు క్వార్టర్లలో  దేశ జీడీపీ గ్రోత్ రేట్ 8 శాతానికి పైన నమోదయ్యిందని అజయ్ అన్నారు.