ప్రపంచ స్వీయ సంరక్షణ దినోత్సవం..మన కోసం మనం చేసుకోవాల్సినవి ఇవే

ప్రపంచ స్వీయ సంరక్షణ దినోత్సవం..మన కోసం మనం చేసుకోవాల్సినవి ఇవే

అంతర్జాతీయ స్వీయ-సంరక్షణ దినోత్సవాన్ని జులై 24వ తేదీన జరుపుకోబోతున్నాం. అయితే  స్వీయ-సంరక్షణ గతంలో కంటే ప్రస్తుతం అత్యంత ముఖ్యమైంది.  ఆరోగ్య ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో..మనల్ని మనం మానసికంగా, శారీరకంగా  చూసుకోవడం చాలా ముఖ్యం. 

మనల్ని మనం జాగ్రత్తగా చూసుకునే ఐదు సులభమైన మార్గాలు

మీ కోసం సమయాన్ని వెచ్చించండి:  మీ కోసం ప్రతీ రోజూ కొంత సమయాన్ని కేటాయించడం.  స్వీయ -సంరక్షణ చిట్కాలలో ఇది సులభమైన, ముఖ్యమైంది. ప్రతీ రోజూ కనీసం మన కోసం మనం గంట లేదా రెండు గంటలు కేటాయించుకోవాలి.  మనం ఆనందించే పనిని చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి.  

ఆరోగ్యకరమైన ఆహారం తినండి:  ఆరోగ్యంగా తినడం స్వీయ సంరక్షణలో ముఖ్యమైన భాగాలలో ఒకటి. తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తినడం వల్ల మన శక్తి స్థాయిలను పెంచుకోవచ్చు. అంతేకాకుండా  ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో  మంచి ఆహారం  సహాయపడుతుంది.  ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్ పానీయాలను నివారిస్తే మంచిది. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: స్వీయ సంరక్షణలో వ్యాయామం మరొక అత్యంత ముఖ్యమైనది.  రెగ్యులర్ వ్యాయామం  మనలోని ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీర ఫిట్‌నెస్ స్థాయిలను పెంచుతుంది.  అంతే కాదు వాకింగ్ లేదా రన్నింగ్,  ఇతర వ్యాయామంలో పాల్గొనడం వల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులతో  బంధాలు మరింత మెరుగుపడతాయి. 

తగినంత నిద్ర పోవాలి :  తగినంత నిద్ర పోవడం  మంచి ఆరోగ్యానికి కీలకం.  రాత్రి ఖచ్చితంగా  ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి.  పడుకోవడానికి ఒక గంట ముందు అన్ని లైట్లు ఆఫ్ చేయండి.  ఇది నిద్రవేళకు ముందు మీ శరీరం, మనస్సు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. 

మైండ్‌ ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి: మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి మరొక మార్గం.. రోజూ మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం. మైండ్‌ఫుల్‌నెస్ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. మన ఏకాగ్రతను మెరుగుపర్చి సానుకూల ఆలోచనలు, సానుకూల భావోద్వేగాలను పెంపొందిస్తుంది.  ధ్యానం, యోగా వంటివి మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.