4 రోజుల్లోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఇంటర్నెట్ కంప్యూటర్‌‌‌‌

4 రోజుల్లోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఇంటర్నెట్ కంప్యూటర్‌‌‌‌
  • బ్లాక్‌‌‌‌‌‌‌‌ చెయిన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌తో వేగంగా ట్రాన్సాక్షన్లు
  • ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ల, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లను డెవలపర్లు క్రియేట్ చేసుకోవచ్చు
  • ఎథరమ్‌‌‌‌‌‌‌‌కు పోటీ అంటున్న క్రిప్టో వర్గాలు

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కంప్యూటర్‌‌‌‌‌‌‌‌(ఐసీపీ)‌‌‌‌‌‌‌‌..కొత్తగా క్రిప్టో ఎక్స్చేంజిల్లో లిస్టయిన బ్లాక్‌‌‌‌‌‌‌‌చెయిన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌. లిస్ట్‌‌‌‌‌‌‌‌ అయిన నాలుగు రోజుల్లోనే  నాల్గో అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా ఎదిగిందని కాయిన్‌‌‌‌‌‌‌‌మార్కెట్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌ డాట్ కామ్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. ఐసీపీ డెవలప్‌‌‌‌‌‌‌‌ చేయడానికి సుమారు ఐదేళ్లు పట్టిందని ఈ ప్రాజెక్ట్ డెవలపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డొమినిక్‌‌‌‌‌‌‌‌ విలియమ్స్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఓకెక్స్‌‌‌‌‌‌‌‌, హోబి, బినాన్స్‌‌‌‌‌‌‌‌, గేట్.ఐఓ, కాయిన్‌‌‌‌‌‌‌‌బేస్‌‌‌‌‌‌‌‌ వంటి కొన్ని హై ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ క్రిప్టో ఎక్స్చేంజిల్లో  శుక్రవారం(మే 7 )  ఐసీపీ లాంచ్ అయ్యింది. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపర్లు ట్రెడిషనల్‌‌‌‌‌‌‌‌గా వాడే కమర్షియల్ క్లౌడ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌లకు బదులు ఐసీపీని వాడాలని ఈ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ క్రియేటర్‌‌‌‌ చెబుతున్నారు. ఐసీపీ ద్వారా వేగంగా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లను క్రియేట్ చేయొచ్చని, ఇంటర్నెట్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌ ఐటీ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను ఐసీపీతో క్రియేట్ చేయొచ్చని అన్నారు. ఈ బ్లాక్ చెయిన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లో ‘చెయిన్‌‌‌‌‌‌‌‌ కీ’ టెక్నాలజీని వాడామని, ట్రాన్సాక్షన్ల స్మార్ట్ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌లను 1–2 సెకెండ్లలోనే ఈ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేస్తుందని చెప్పారు. ఐసీపీ క్రిప్టోకరెన్సీ ఎథరమ్‌‌‌‌‌‌‌‌కు ముప్పు అని కొంత మంది  క్రిప్టో ఇన్వెస్టర్లు విమర్శిస్తున్నారు. 

డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌లో లాభాలొచ్చాయి.. జాబ్‌‌‌‌‌‌‌‌ మానేస్తున్న
డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌లో ఫుల్‌‌‌‌‌‌‌‌గా లాభాలు సంపాదించడంతో ఫైనాన్షియల్ కంపెనీ గోల్డ్‌‌‌‌‌‌‌‌మ్యాన్ శాచ్స్‌‌‌‌‌‌‌‌ ఎండీ తన జాబ్‌‌‌‌‌‌‌‌ మానేశారు. తాజాగా డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్ రికార్డ్ స్థాయిలకు చేరడంతో లాభాలు సంపాదించిన అజిజ్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌మహన్‌‌‌‌‌‌‌‌ లండన్‌‌‌‌‌‌‌‌లోని తన జాబ్‌‌‌‌‌‌‌‌ను వదిలేశారని ఈఫైనాన్షియల్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది.  ఆయన సొంతంగా ఓ హెడ్జ్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేస్తారనే వార్తలు వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేసే లుయి జాంగ్‌‌‌‌‌‌‌‌ కూడా తన జాబ్‌‌‌‌‌‌‌‌ వదిలేసి కాయిన్‌‌‌‌‌‌‌‌బేస్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయ్యారు. టెస్లా సీఈఓ ఎలన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డోజ్‌‌‌‌‌‌‌‌–1 మిషన్‌‌‌‌‌‌‌‌ ను చందమామపైకి పంపుతామని గతంలో ప్రకటించారు.  దీంతో ఈ కరెన్సీకి మంచి డిమాండ్ క్రియేటవుతోంది.పేమెంట్స్ కోసం ఈ క్రిప్టోకరెన్సీని అంగీకరిస్తామని కూడా ప్రకటించారు. తాజాగా ఈ కరెన్సీని ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ అని అనడంతో కరెన్సీ భారీగా క్రాస్‌‌‌‌‌‌‌‌ అయ్యిందని గమనించాలి.