24 రోజులుగా ఇరాన్ లో ఇంటర్నెట్ బంద్ : ప్రపంచంలో ఇదే అత్యధిక రోజులు

24 రోజులుగా ఇరాన్ లో ఇంటర్నెట్ బంద్ : ప్రపంచంలో ఇదే అత్యధిక రోజులు

యుద్దంలో ఉన్న ఇరాన్ దేశంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధం ప్రకటించిన మరు క్షణం.. దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది అక్కడి ప్రభుత్వం. ఇంటర్నెట్ బంద్ అయ్యి 24 రోజులకు చేరింది. ఇప్పటికీ అక్కడ నెట్ లేదు. పాక్షికంగా కాదు కదా.. అస్సలు ఇంటర్నెట్ అనేది లేకుండాపోయింది. నెట్ ఆధారంగా శత్రువులు దాడులు చేయొచ్చన్న ఉద్దేశంతో బ్లాక్ ఔట్ ప్రకటించింది ఇరాన్ దేశం. 

552 గంటలుగా ఇంటర్నెట్ లేకుండా ఓ దేశం ఉండటం.. ప్రపంచంలోనే ఇది అంటున్నాయి సర్వే సంస్థలు. నెట్ బ్లాక్స్ అనే సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం.. అంతరాయాలకు సంబంధించిన డేటా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఇరాన్ దేశంలో ఇంటర్నెట్ కు సంబంధించి డేటా రిలీజ్ చేసింది.

24 రోజులుగా.. 552 గంటలుగా ఓ దేశం ఇంటర్నెట్ లేకుండా ఉండటం అనేది ఇదే ఫస్ట్ అని ప్రకటించింది నెట్ బ్లాక్ సంస్థ. ప్రస్తుతం ఇరాన్ దేశంలో సాధారణ పౌరుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఇంటర్నెట్ అందుబాటులో లేదని.. ఇంటర్నెట్ షెడ్ డౌన్ అయినట్లు వెల్లడిస్తుంది ఈ సంస్థ.