‘క్రేజీ అంకుల్స్’ సినిమాను అడ్డుకుంటం

V6 Velugu Posted on Aug 19, 2021

తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ
ఖైరతాబాద్ వెలుగు: క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్​లో మహిళలను అగౌరవపరిచేలా సన్నివేశాలున్నాయని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి  రత్న ప్రభ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. సమాజాన్ని తప్పు దారి పట్టించే క్రేజీ అంకుల్స్ లాంటి సినిమాలను బ్యాన్ చేయాలన్నారు.  కొందరు సామాజిక బాధ్యత లేకుండా సినిమాలు తీస్తున్నారన్నారు. నేడు రిలీజ్ అయ్యే ఈ మూవీని అడ్డుకుంటామని హెచ్చరించారు. స్టూడెంట్ జేఏసీ నాయకుడు రాజు మాట్లాడుతూ.. యువతీయువకులను తప్పుదారి పట్టించే ఇలాంటి సినిమాలను ఆడనివ్వకూడదు, ఆదరించకూడదని పేర్కొన్నారు. బొడ్డు అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, రాజారవీంద్ర మెయిన్​​ రోల్​లో నటించగా... సత్తిబాబు డైరెక్ట్ చేశారు. 

Tagged movie, srimukhi, , Interrupting, Crazy Uncles

Latest Videos

Subscribe Now

More News