ఇక నుంచి తగ్గనున్న వడ్డీ రేట్లు

ఇక నుంచి తగ్గనున్న వడ్డీ రేట్లు
  •  ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ ఎండీ క్రిస్టలినా జార్జీవా

న్యూఢిల్లీ :  గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎకానమీ కోలుకుంటోందని, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌ల్యాండింగ్ (పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారవని) కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌‌‌‌‌‌‌‌ (ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌)   ఎండీ క్రిస్టలినా జార్జీవా పేర్కొన్నారు. ఈ ఏడాది మధ్య నుంచి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు  వడ్డీ రేట్లు తగ్గించడాన్ని ప్రారంభిస్తాయని చెప్పారు.  కరోనా కేసులు మళ్లీ పెరగొచ్చని, అలానే ఇజ్రాయిల్– హమాస్‌‌‌‌‌‌‌‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎకానమీకి రిస్క్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయన్నారు.  ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులు ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌  వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడడం చూస్తున్నామని జార్జీవా చెప్పారు.