చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తది

చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తది

ఓవైపు సోలో హీరోగా నటిస్తూనే.. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి మెప్పించాడు అల్లరి నరేష్. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగా’ చిత్రంలోనూ కీరోల్ చేస్తున్నాడు. శుక్రవారం నరేష్‌‌‌‌‌‌‌‌ పాత్రను పరిచయం చేస్తూ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘చేసేయ్ చేసేయ్.. లేదంటే ‘మాటొచ్చేత్తది’ అంటూ సరదాగా అందరితో కలిసిపోయే అంజి అనే పాత్రలో నరేష్ కనిపించాడు. నాగార్జున, నరేష్‌‌‌‌‌‌‌‌ పాత్రల మధ్య గల స్నేహాన్ని పరిచయం చేయడంతో పాటు, పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించారు.

ఎంఎం కీరవాణి అందించిన సంగీతం విజువల్స్‌‌‌‌‌‌‌‌కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన మాస్‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ఇదని చెబుతున్నారు మేకర్స్. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.