హుజూర్ నగర్, వెలుగు: కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
కేంద్ర అమలు చేస్తున్న లేబర్ కోడ్ ల వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందని మంత్రికి వివరించామన్నారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
