దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్లు.. రాజీనామా చేయండి : పొన్నం

దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్లు..  రాజీనామా చేయండి : పొన్నం
  • అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారణ
  • మాజీ ఎంపీ వినోద్ చెల్లెలికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తం 
  • ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది
  • అలాంటోళ్లందరూ భూమి తిరిగిచ్చేయాలన్న మంత్రి 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందినోళ్లంతా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. నీతి,  నిజాయతీగా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలని సూచించారు. మంగళవారం గాంధీభవన్​లో మీడియాతో పొన్నం చిట్​చాట్ చేశారు. గతంలో బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్లంతా బయటకు వెళ్లిపోవాలనిఅన్నారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, విచారణ జరిపించాల్సిందిగా కోరతానని చెప్పారు. 

అన్ని శాఖల్లోనూ విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైన నిరుద్యోగులకే ఉద్యోగాలు దక్కాలన్నారు. ‘‘బోయినపల్లి వినోద్​కుమార్​చెల్లెలికిఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్​చెల్లెలు కూడా భూనిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమి తీసుకున్నది. అలాంటి వాళ్లు భూములు తిరిగిచ్చేయాలి” అని సూచించారు. అందరి బాగోతాలనూ బయటపెడతామన్నారు. కరీంనగర్​లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్​కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలయ్యాయని వస్తున్న విమర్శల నేపథ్యంలో దరఖాస్తుల ఎంట్రీపై జీహెచ్​ఎంసీ కమిషనర్​రొనాల్డ్​రోస్​ను మంత్రి వివరణ కోరారు.