పేటీఎం బ్యాంక్‌‌‌‌లోని ఎఫ్‌‌‌‌డీఐలపై దర్యాప్తు?

పేటీఎం బ్యాంక్‌‌‌‌లోని ఎఫ్‌‌‌‌డీఐలపై దర్యాప్తు?

     ఏర్పాటు కానున్న ఇంటర్ మినిస్టీరియల్‌‌‌‌‌‌‌‌ కమిటీ 

న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌లోకి చైనా నుంచి వచ్చిన  ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల (ఎఫ్‌‌‌‌డీఐ) ను ప్రభుత్వం దర్యాప్తు చేయనుంది. ఇందుకోసం  ఇంటర్‌‌‌‌‌‌‌‌ మినిస్టీరియల్ కమిటీ ఒకటి ఏర్పాటు కానుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. పేటీఎం పేమెంట్స్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌  2020 నవంబర్‌‌‌‌‌‌‌‌లో లైసెన్స్‌‌‌‌ కోసం  అప్లికేషన్ పెట్టుకుంది.  కానీ, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఈ అప్లికేషన్‌‌‌‌ను తిరస్కరించింది. ఎఫ్‌‌‌‌డీఐ రూల్స్‌‌‌‌లోని ప్రెస్‌‌‌‌ నోట్‌‌‌‌ 3 ని  ఫాలో అయ్యి, అప్లికేషన్‌‌‌‌ను మళ్లీ సబ్మిట్ చేయాలని అప్పుడు అడిగింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పేరెంట్ కంపెనీ వన్‌‌‌‌97 కమ్యూనికేషన్స్‌‌‌‌లో చైనీస్ కంపెనీలకు వాటాలు ఉన్న విషయం తెలిసిందే.  చైనా కంపెనీ యాంట్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఈ కంపెనీలో మేజర్ షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్‌‌‌‌‌‌‌‌.