రామనారాయణ వివాదంపై విచారణ పూర్తి

రామనారాయణ వివాదంపై విచారణ పూర్తి

 భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామనారాయణ వివాదంపై హైకోర్టు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ బుధవారం విచారణ పూర్తి చేసింది. మంగళవారం ఆలయ అర్చకులు, ఫిర్యాదుదారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వారి వాదనలను రికార్డు చేశారు. రెండో రోజులు ఆలయంలో జరుగుతున్న పూజా విధానాలు, నిత్య కల్యాణం తంతును రికార్డు చేశారు. నివేదిక రూపంలో రాసుకున్నారు. 

వాది, ప్రతివాదుల నుంచి సేకరించిన సమాచారం కోర్టుకు సమర్పించనున్నారు. అప్పటివరకు ఈ వివాదంపై బహిరంగంగా చర్చ జరపొద్దని కోర్టు సూచించిన సంగతి విదితమే.