పీఎంఓ ఆఫీస్ నుంచి మంచు లక్ష్మీకి ఫోన్..ఎందుకంటే?

పీఎంఓ ఆఫీస్ నుంచి మంచు లక్ష్మీకి ఫోన్..ఎందుకంటే?

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.  చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆమె రియాక్ట్ అయిన తీరు కూడా రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు కారణమైంది. ఇది అంశంపై లక్ష్మి రియాక్ట్ అవుతూ..వావ్.. ఏపీ పాలిటిక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిపై కొంతమంది ఆమెకు అనుకూలంగా స్పందిస్తే మరికొందరు వ్యతిరేకంగా స్పందించారు.

లేటెస్ట్ గా మంచు లక్ష్మి నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మంచు లక్ష్మికి..ఢిల్లీకి రావాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం( Prime Minister Office) నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. మోడీ నుంచి పిలుపు రావడంపై త్వరలో బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు మంచు లక్ష్మి సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.

అంతేకాకుండా..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లుపై..మాట్లాడానికి దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మహిళల అందరీకీ ప్రధాని మోడీ ఆహ్వానం పంపిస్తున్నట్లు సమాచారం. అందులో భాగాంగానే మంచు లక్ష్మీకి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఏదీ ఏమైనా పీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో మంచు లక్ష్మీకి మరోసారి.. సోషల్ మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది.