
కొత్త పార్లమెంట్ భవనానికి బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తరలి వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా పలువురు సెలెబ్రెటీస్ ఆనందం వ్యక్తం చేస్తూ..పార్లమెంట్ భవనాన్ని విజిట్ చేస్తున్నారు.
లేటెస్ట్గా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaahbhatia) పార్లమెంట్ లో కొంత సమయం సందడి చేశారు. చీర కట్టులో తమన్నా చాలా సంప్రదాయంగా రావడంతో..మీడియా వాళ్ళు తమన్నాను చుట్టుముట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
అలాగే తమన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఆనందం వ్యక్తం చేస్తూ..ఈ బిల్లుతో మహిళలకు పాలిటిక్స్ లో కూడా అవగాహన పెరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా అన్ని రంగాల్లో రావడానికి ఈ బిల్లు ప్రేరేపిస్తుంది..అంటూ తమన్నా తెలిపారు.
ఇక రీసెంట్గా ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఇండియా క్రికెటర్ మిథాలి రాజ్,మేరీకోమ్, రాణి రామ్ పాల్, దీపా మెహతా లు, ఖుష్బూ, మంచులక్ష్మీ కూడా కొత్త పార్లమెంట్ భవనంను విజిట్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్స్ షెహనాజ్ గిల్ ఇంకా భూమి పెడ్నేకర్ లు ఇటీవల కొత్త పార్లమెంట్ భవనంను విజిట్ చేసి తమ ఆనందంను షేర్ చేసుకున్నారు. అలాగే బాలివుడ్ యాక్టర్ కంగనా రనౌత్ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా ఆహ్వాని తురాలిగా ఆమె హాజరయ్యిన విషయం తెలిసిందే.
#WATCH | On Women's Reservation Bill, actor Tamannaah Bhatia says, "...This bill will inspire common people to join politics". pic.twitter.com/nbjAq4Aqqd
— ANI (@ANI) September 21, 2023