పారిస్ ఒలింపిక్స్ మెడలిస్టులకు ఐఓఏ సన్మానం

పారిస్ ఒలింపిక్స్ మెడలిస్టులకు ఐఓఏ సన్మానం

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకాలు గెలిచిన దేశ క్రీడాకారులను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) సోమవారం ఢిల్లీలో ఘనంగా సన్మానించి క్యాష్​రివార్డులను అందించింది. జావెలిన్ త్రోలో రజతం గెలిచిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు అత్యధికంగా రూ. 75 లక్షల ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ లభించింది. నీరజ్ దేశంలో లేకపోవడంతో అతని తరఫున అథ్లెటిక్స్ ఫెడరేషన్ అధికారి.. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

నీరజ్ మాజీ కోచ్ క్లాస్ బార్టోనియెట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.20 లక్షలు అందజేశారు. స్టార్ షూటర్ మను భాకర్ 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంస్యానికి రూ. 50 లక్షలు, మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ టీమ్ కాంస్యానికి శరబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోత్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి రూ. 50 లక్షలు పంచుకుంది.

రెజ్లర్ అమన్ సెహ్రావత్ (కాంస్యం), షూటర్ స్వప్నిల్ కుసాలే (కాంస్యం)కు చెరో రూ. 50 లక్షలు చొప్పున బహుమతులు లభించాయి. కాంస్యం గెలిచిన ఇండియా మెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రతీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 10 లక్షలు, హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 20 లక్షలను ఐఓఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీటీ ఉషతో కలిసి మాండవీయ అందించారు.