భారీగా నష్టపోతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు

భారీగా నష్టపోతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు

న్యూఢిల్లీ: గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్, డొమెస్టిక్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ ధరల్లో మార్పులేకపోవడంతో ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐఓసీ, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీపీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కలిపి రూ. 18,480 కోట్ల నష్టం వచ్చింది. గతంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లను ప్రభుత్వం  కంట్రోల్ చేసినప్పుడు కూడా ఈ కంపెనీలకు ఇంతలా నష్టం రాకపోవడాన్ని గమనించాలి. క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 109 డాలర్లు చెల్లించి ఈ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి.

కానీ, లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లను 80–85 డాలర్లకు తగ్గట్టు అమ్ముతున్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం, ఈ కంపెనీలు లీటర్ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ. 12–14 నష్టానికి అమ్ముతున్నాయి.  గత నాలుగు నెలల నుంచి పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లలో ఎటువంటి మార్పులేదు. ధరలను మార్చకపోవడానికి గల  కారణాన్ని కూడా ఈ కంపెనీలు ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం దేశంలో రిటైల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 7 శాతానికి పైన నమోదవుతోంది.

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గాలంటే పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ రేట్లు కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ ఫోకస్ పెట్టడంతోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫ్యూయల్ రేట్లను మార్చకుండా ఉంచుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గాను రూ. 1,995.3 కోట్ల నష్టాన్ని ఐఓసీ, రూ. 10,196.94 కోట్ల నష్టాన్ని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ. 6,290.8  కోట్ల నష్టాన్ని బీపీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ప్రకటించాయి.