ఐఓసీ ప్రాఫిట్ 50 శాతం అప్‌‌‌‌

ఐఓసీ ప్రాఫిట్ 50 శాతం అప్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎల్‌‌‌‌పీజీ గ్యాస్ సేల్స్‌‌‌‌పై సబ్సిడీ ఇచ్చినా, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) నికర లాభం ఏడాది లెక్కన 50 శాతం  పెరిగింది. కంపెనీ నికర లాభం (స్టాండ్‌‌‌‌ఎలోన్‌‌‌‌) రూ.4,834.69 కోట్ల నుంచి  రూ.7,264.85 కోట్లకు  చేరుకుంది. ఎల్‌‌‌‌పీజీ సేల్స్ వలన ఐఓసీకి రూ.5,601 కోట్ల నష్టం రాగా,  ఇన్వెంటరీ గెయిన్స్ వలన ఈ నష్టాలు తగ్గాయి. 

ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఐఓసీకి రూ.2.17 లక్షల రెవెన్యూ వచ్చింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీకి రూ.12,962 కోట్ల నికర లాభం, రూ.8.45 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది.