ఐదేళ్లలో ఐఓసీ రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడి

ఐదేళ్లలో ఐఓసీ రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడి
  • ఆయిల్ రిఫైనింగ్‌‌, నేచురల్ గ్యాస్‌‌, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లలో విస్తరించే ప్లాన్

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వచ్చే 5 ఏళ్లలో  రూ.1.66 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. ఆయిల్ రిఫైనింగ్, ఫ్యూయల్ మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, నేచురల్ గ్యాస్, రెన్యూబుల్ ఎనర్జీ రంగాల్లో విస్తరించే ప్లాన్‌‌లో ఉంది.

2028 నాటికి క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ సామర్థ్యాన్ని 8.07 కోట్ల నుంచి 9.84 కోట్ల టన్నులకు పెంచుకోవాలని,  22 వేల కిలోమీటర్ల పైప్‌‌లైన్ నెట్‌‌వర్క్, 1.3 కోట్ల టన్నుల పెట్రోకెమికల్స్ సామర్ధ్యాన్ని చేరుకోవాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. కంపెనీ చైర్మన్ అర్విందర్‌‌‌‌ సింగ్ సహ్నే ప్రకారం, పెట్రోల్ బంకుల్లో  ఈవీ ఛార్జర్లు, సీఎన్‌‌జీ/ఎల్‌‌ఎన్‌‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని,  గ్రీన్ హైడ్రోజన్, సస్టయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్‌‌ఏఎఫ్‌‌) తయారీ పెంచడం, 18 గిగా వాట్స్ రెన్యూబుల్ విద్యుత్ సామర్ధ్యాన్ని మూడేళ్లలో చేరుకోవడం వంటి లక్ష్యాలను కంపెనీ పెట్టుకుంది.

మరో వైపు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మారేందుకు  రూ.2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.  సర్వో లూబ్రికెంట్స్ 45 దేశాలకు విస్తరించగా, ఎల్‌‌పీజీ సెగ్మెంట్‌‌లో 45శాతం మార్కెట్ వాటాను, ఏవియేషన్ ఫ్యూయల్‌‌లో 54.5శాతం వాటాను ఐఓసీ కంట్రోల్ చేస్తోంది. క్రైజోనిక్స్‌‌, ఎక్స్‌‌ప్లోజివ్స్‌‌, డేటా ట్రాన్స్‌‌మిషన్‌‌ వంటి కొత్త రంగాల్లోకి కూడా  ఎంట్రీ ఇచ్చింది. కాగా,  ఐఓసీ  2024–25లో 10 కోట్ల టన్నుల అమ్మకాలు జరపగా, రోజుకి 3.2 కోట్ల వినియోగదారులకు సేవలు అందించింది. 15 కోట్ల ఇండ్లకు ఎల్‌‌పీజీ సప్లయ్ చేసింది.